Tollywood: ఇన్నాళ్లు ఓటీటీని విలన్‌ చేశారు.. ఇప్పుడేమంటారు?

9 Aug, 2022 16:23 IST|Sakshi

డిజాస్టర్ల పరంపరకు ‘సీతారామం’, ‘బింబిసార’ బ్రేక్‌

‘మంచి సినిమాలు తీస్తున్నాం. కాని ఆడియెన్స్ మాత్రం థియేటర్ కు రావడం లేదు. ఓటీటీలకు అతుక్కుపోతున్నారు’అంటూ ఇన్ని రోజులు టాలీవుడ్ పెద్దలు చెప్పినవన్ని ఉత్తి మాటలే అని ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు నిరూపించాయి.  వరుసగా  డిజాస్టర్లతో సతమతమవుతున్న టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరి అందించాయి. 

‘మేజర్‌’, ‘విక్రమ్‌’ తర్వాత టా వచ్చిన చిత్రాలేవి కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. మొన్నటి వరకు ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం.. అవి డిజాస్టర్లుగా మిగిలిపోవడం టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌గా మారిపోయింది.  అయితే ఈ డిజాస్టర్స్ ట్రెండ్ కు టాలీవుడ్ ఇంతకాలం ఆడియెన్స్ థియేటర్‌ కు రాకపోవడమే రీజన్ గా చెప్పుకొచ్చింది. ఓటీటీ ను మెయిన్ విలన్ గా చేసింది.

(చదవండి: సీతారామం సక్సెస్‌.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్‌ సల్మాన్‌)

అయితే రెండు నెలల్లో రిలీజైన సినిమాల కంటెంట్ గురించి మాత్రం ఎప్పుడూ చర్చించలేదు. ఫెయిల్యూర్స్ ను విశ్లేసించలేదు. అంటే సుందరానికి, విరాటపర్వం, గాడ్సే, సమ్మతమే, పక్కా కమర్షియల్ , హ్యాపీ  బర్త్ డే, ది  వారియర్,  థ్యాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ అన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఎందుకో  తెలియదు కాని ఈ సినిమాల్లో కంటెంట్  ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దాంతో డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి.
(చదవండి:  థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?)

8 వారాలుగా ఇండస్ట్రీలో డిజాస్టర్ల మోత మోగడంతో దర్శకనిర్మాతల్లోనూ, హీరోల్లోనూ ఒక లాంటి భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ మనగడే కష్టం అని గ్రహించారు. దాంతో వెంటనే గిల్డ్ షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఇంతోలో బింబిసార, సీతారామం డిజాస్టర్ల పరంపరకు బ్రేక్ ఇచ్చాయి. రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయిన ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించాయి.  బింబిసార మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తుండగా సీతారామం క్లాస్ ప్రేక్షకులను, యూత్ ఆఢియెన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.

మరిన్ని వార్తలు