Dulquer Salmaan: 'అందుకే 'సీతారామం' చేయడానికి అంగీకరించాను'

14 Aug, 2022 07:38 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో సినిమాల సక్సెస్‌ అరుదైపోయిందనే చెప్పాలి. అసలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికే సుముఖత చూపడం లేదు. ఎందుకు కారణాలు ఎన్నైనా ఉండవచ్చు. అయితే మంచి కంటెంట్‌తో వచ్చిన చిత్రాలను ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధమే. ఇందుకు ఉదాహరణ సీతారామం. తమిళంలో అనువాద చిత్రంగా రూపొందిన తెలుగు చిత్రం ఇది. దుల్కర్‌ సల్మాన్, ఉత్తరాది భామ మృణాల్‌ ఠాగూర్‌ జంటగా నటించిన ఇందులో నటి రష్మిక మందన్నా, టాలీవుడ్‌ నటుడు సుమంత్‌ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

అశ్వినీదత్‌ సమర్పణలో వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈచిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గత 5వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది. త్వరలో హిందీలోనూ వి డుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో లైకా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం చెన్నైలో చిత్ర సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ముందుగా లైకా సంస్థ నిర్వాహకుడు త మిళ్‌ కుమరన్‌ మాట్లాడుతూ లైకా ప్రొడక్షన్స్‌ విజయవంతమైన చిత్రాల వరుసలో సీతారామం నిలవడం సంతోషంగా ఉందన్నారు.

ఇకపై కూడా మంచి కథా చిత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ సీతారామం కథ విన్నప్పుడే ఇది డ్రీమ్‌ చిత్రం అని భావించానని చేశారు. ఇది అద్భుతమైన క్లాసికల్‌ ప్రేమ కావ్యం అని పేర్కొన్నారు. ఇంతకుముందు వినని కథ కావడం, చాలా ఒరిజినల్‌గా అనిపించడంతో తాను నటించడానికి అంగీకరించానన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని చిత్రం అన్నారు. చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.

చిత్ర దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ సీతారామం చిత్రం తమిళనాడులోనూ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.  చిత్రం వావ్‌ అనిపించడం వెనుక పెద్ద వార్‌ ఉందన్నారు. ముఖ్యంగా చిత్ర యూనిట్‌ మూడున్నర ఏళ్ల శ్రమ ఉంటుందన్నారు. కాశ్మీర్‌లోని డిఫరెంట్‌ డిఫికల్ట్‌ లొకేషన్లో మైనస్‌ 24 డిగ్రీల చలిలో షూటింగ్‌ నిర్వహించామన్నారు. నటుడు దుల్కర్‌ సల్మాన్, ఇతర నటీనటులు, యూనిట్‌ సహకారంతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు.  

మరిన్ని వార్తలు