Sita Ramam Twitter Review: ‘సీతారామం’ టాక్‌ ఎలా ఉందంటే...

5 Aug, 2022 06:41 IST|Sakshi

'మహానటి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌. చాలా గ్యాప్ తర్వాత మరోసారి ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించగా, రష్మిక, సుమంత్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై  అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాను పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సీతారామం’పై బజ్‌ క్రియేట్‌ అయింది.  భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 05) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

(చదవండి: ‘బింబిసార’ ట్విటర్‌ రివ్యూ)

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సీతారామం’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు నెటిజన్స్‌. విజువల్స్‌ , టెక్నికల్‌ వ్యాల్యూస్‌ ఉన్నతంగా ఉన్నాయని చెబుతున్నారు. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతమని కామెంట్‌ చేస్తున్నారు. 

ఫస్టాప్‌లో వచ్చే లవ్‌ సీన్స్‌, పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్‌ సీన్స్‌ అదిరిపోయిందట. ఇక సెకండాఫ్‌ లో స్క్రీన్‌ప్లేతో మాయ చేశారని చెబుతున్నారు. పాటలు, క్లైమాక్స్‌ కూడా బాగున్నాయంటూ  ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఒదిగిపోయాడని, మృణాల్‌, దుల్కర్‌ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందట. అయితే ఫస్టాఫ్‌ కాస్త స్లోగా ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు