‘ఫన్‌’టాస్టిక్‌  సితార .. ‘తగ్గేదే లే’అంటున్న అర్హ.. ‘స్టార్‌’లా ఎదిగిన కిడ్స్‌ వీరే

20 Nov, 2022 13:47 IST|Sakshi

ఇవ్వాళ్టి పిల్లలు పెద్దల నీడన దాగుండిపోవడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు.. తల్లిదండ్రుల పాపులారిటీతో పరిచయం అవడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరుప్రఖ్యాతులను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని సొంత ఐడెంటిటీని క్రియేట్‌ చేసుకుంటున్నారు. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు.  ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది లిటిల్‌ స్టార్స్‌ గురించి.. 

‘ఫన్‌’టాస్టిక్‌  సితార 
చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది  మహేశ్‌ బాబు–నమ్రతా శిరోడ్కర్‌ వారసురాలు సితార! ‘ఫన్‌’టాస్టిక్‌ తార అనే వెబ్‌ సిరీస్‌కు సితార బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘జన్యాస్‌ క్లోజట్‌’ బ్రాండ్‌ కోసం మోడలింగ్‌ కూడా చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్‌ చానెల్‌నూ నిర్వహిస్తోంది. 

తగ్గేదే లే...
ఈ మాట అల్లు అర్జున్‌ గారాల పట్టి అల్లు అర్హకి సరిగ్గా సరిపోతుంది. సూపర్‌ యాక్టివ్‌నెస్‌తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్‌  ఫాలోయింగ్‌ని క్రియేట్‌ చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు.. ముద్దొచ్చే రూపంతో తన  తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ, డైలాగ్స్‌ చెప్తూ, పాటలు..డ్యాన్స్‌లతో డిజిటల్‌  మీడియా వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్‌ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్‌ ప్లేయర్‌ కూడా!

‘మంచు’ సింగర్స్‌...
మంచు విష్ణు కూతుళ్లు అరియానా–వివియానా..  ఇన్‌స్టా స్టార్స్‌. ఈ ట్విన్‌ సిస్టర్స్‌ ఫొటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందం, అభినయమే కాదు.. మధురమైన గాత్రం కూడా వీరి సొంతం. వాళ్ల నాన్న విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా కోసం ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అనే గీతాన్ని ఆలపించారీ అక్కాచెల్లెళ్లు. ఈ పాట విడుదలైన ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోవైపు మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ కూడా మై కిసీ సే కమ్‌ నహీ అంటోంది. పేరుకు తగ్గట్టే చదువులో దిట్ట ఈ బిడ్డ. కరోనా సమయంలో తల్లితో కలసి యూట్యూబ్‌ వీడియోలు చేసి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. అన్నట్టు విద్య కూడా మంచి చెస్‌ ప్లేయర్‌. 

ఇంటి చిరు కొమ్మ.. 
అమ్మ, నాన్న, తాతకు తగ్గకుండా తన పేరునూ పాపులర్‌ చేసుకుంటోంది ఐశ్యర్య, అభిషేక్‌ కూతురు ఆరాధ్య బచ్చన్‌. శ్రావ్యమైన స్వరంతో క్రిస్మస్‌ జింగిల్స్‌.. ఇతర పాటలు పాడుతూ తన ఐడెంటిటీ చాటుకుంటోంది. 

‘పవర్‌’ ఫుల్‌ డాటర్‌
పవన్‌  కల్యాణ్‌–రేణూ దేశాయ్‌ కూతురు ఆద్యకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ అమ్మాయి మొన్నామధ్య గిటార్‌ వాయిస్తూ పాడిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! ఆమె గాన మాధుర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తండ్రిలాగే ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం.

మరిన్ని వార్తలు