Siva Balaji: డిప్రెషన్‌లోకి వెళ్లా.. లోలోపల ఏడ్చేశా: శివ బాలాజీ

3 Jan, 2023 17:21 IST|Sakshi

శివ బాలాజీ అంటే టాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో ఆయన నటించారు.  'ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ' అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ ఆ తర్వాత సినీ రంగంపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. చందమామ, శంభో శివశంభో, ఆర్య, అన్నవరం, టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రాలతో గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ బాలాజీ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

(ఇది చదవండి: 'పంత్ కోసం ప్రార్థించండి'.. ఊర్వశి రౌతేలా మదర్ పోస్ట్‌ వైరల్.)

శివ బాలాజీ మాట్లాడుతూ.. ' నా ఫ్రెండ్స్ ద్వారా ఈము పక్షుల పెంపకం గురించిన విన్నా. దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుందని చెప్పారు. ఆ తర్వాత నేను ఈము పక్షుల పెంపకం మొదలుపెట్టా. దాదాపు 500 ఈము పక్షులతో యూనిట్ ప్రారంభించాం. దాదాపు ఒక నెలకు వాటికోసం రూ.5 లక్షలు ఖర్చు చేసేవాన్ని. కానీ ఆ తర్వాత మాకు తెలిసింది అదంతా ఓ స్కామ్ అని. కానీ ప్రభుత్వం మీట్ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిందని చెప్పారు. దీనికి తగినంత మార్కెట్ దొరకలేదు. ఆ తర్వాత పెయిన్ రిలీఫ్ ఆయిల్, సోప్స్ వ్యాపారం మొదలెట్టాం. ఇది కూడా పెద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నేను స్నేహమేరా జీవితం సినిమా చేశా. కానీ పెద్దగా మార్కెట్ చేయలేదు. మూవీ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేశా. ఈ ప్రభావం నాపై ఎక్కువగా పడింది. లోలోపల చాలా ఫీలయ్యా. నా వల్ల అందరూ బాధపడ్డారని భావించా. నా వల్ల అందరూ ఫెయిల్ అయ్యారని తీవ్ర నిరాశకు గురయ్యా. నా భార్య మధుమిత వల్లే నేను మళ్లీ నార్మల్ అ‍య్యా.' అని అన్నారు. 

మరిన్ని వార్తలు