Sivakarthikeyan: ప్రిన్స్‌గా రాబోతున్న హీరో శివకార్తికేయన్‌

9 Jun, 2022 19:44 IST|Sakshi

సీమ రాజా, శక్తి, రెమో, డాక్టర్‌ వంటి డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివకార్తికేయన్‌. ప్రస్తుతం అతడు అనుదీప్‌ కేవి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ప్రిన్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మేరకు శివకార్తికేయన్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సైతం వదిలారు.

ఇందులో హీరో చేతిలో గ్లోబ్‌ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాను సురేశ్‌ బాబు, సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం
 బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు

మరిన్ని వార్తలు