మరోసారి  భయపెట్టడానికి సిద్ధమైన హరర్‌ చిత్రం

9 Dec, 2021 08:29 IST|Sakshi

సాక్షి,చెన్నై(తమిళనాడు): మరోసారి భయపెట్టడానికి సీవీ–2 చిత్రం సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సీవీ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దెయ్యం ఒక వ్యక్తి మెడపై కూర్చొని ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా సీవీ–2ను తులసి సినీ ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది. కేఆర్‌ సెంథిల్‌నాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీఎల్‌ సంజయ్‌ చాయాగ్రహణను, ఎస్‌పీ అహ్మద్‌ సంగీతాన్ని అందించారు.

ఇందులో దివంగత నటుడు తేంగాయ్‌ శ్రీనివాసన్‌ మనవడు యోగి, చరణ్‌రాజ్‌ కొడుకు తేజ చరణ్‌ రాజ్‌ ప్రధాన పాత్రలో నటించారు. నటి స్వాతిషా, సంతోష్, క్రిస్టియన్, దాడి బాలాజీ, శ్యామ్స్, కోదండం, గాయత్రి  కుమరన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. 

మరిన్ని వార్తలు