Skanda Movie Collection: రెండో రోజు తగ్గిన వసూళ్లు.. ఓవరాల్‌గా ఎంతంటే?

30 Sep, 2023 18:09 IST|Sakshi

యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్‌తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు  తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!)

స్కంద సంగతేంటి?
బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి.

సగానికి సగం
అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: వరుణ్‌ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!)

మరిన్ని వార్తలు