Skanda Movie Twitter Review: స్కంద మూవీ ఎలా ఉందంటే..

28 Sep, 2023 06:37 IST|Sakshi

అఖండ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్’. రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్‌ సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎ‍ట్టకేలకు నేడు(సెప్టెంబర్‌ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. స్కంద మూవీ ఎలా ఉంది?స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

సాధారణంగా ఓవర్సీస్‌ ఏరియాల్లో సినిమా ముందుగా రిలీజ్‌ అవుతుంది. అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఒక్క రోజు ముందే ప్రీమియర్ షోలు పడతాయి. కానీ స్కంద టీమ్‌ మాత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్లు వేయలేదు. ఇండియాలో ఎప్పుడైతే విడుదల అవుతుందో.. అప్పుడే విదేశాల్లోనూ బొమ్మ పడుతుంది. ఈ రోజు మార్నింగ్‌ కొన్ని చోట్ల షో పడిపోయింది.

ట్విటర్‌లో పలువురు షేర్‌ చేస్తున్న ప్రకారం సినిమాలో కథా బలం తక్కువగా ఉన్నా రామ్‌ పోతినేని మాస్‌ ఎనర్జీతో మెప్పించాడని చెబుతున్నారు. ఎక్కువగా మాస్‌ ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌ ఫైట్స్‌ ఎలివేషన్‌తో పాటు తమన్‌ మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయిందని సమాచారం. ఫస్టాఫ్‌ కొంతమేరకు యావరేజ్‌గా ఉన్నా ఫైనల్లీ సినిమా బాగుందనే అభిప్రాయం ఎక్కువ మంది తెలుపుతున్నారు. రామ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఎక్కడా నిరుత్సాహం చెందరని.. రామ్‌ ఎనర్జీతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకుపోయాడని ఎక్కువ మంది కామెంట్స్‌ చేస్తున్నారు. స్కంద ముగింపును ఆధారంగా చూస్తే పార్ట్‌ -2 కూడా ఉంటుందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. 

మరిన్ని వార్తలు