డైరెక్టర్‌ సుకుమార్‌కు అనారోగ్యం.. షూటింగ్‌కు బ్రేక్‌

25 Jul, 2021 16:18 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రస్తుతం 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యట్రిక్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్‌ సుకుమార్‌ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.

గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సుకుమార్‌ ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్‌కు వారామం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కోలుకున్న వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఈ ఏడాదిలో పుష్ప మొదటి పార్ట్‌ను రిలీజ్‌ చేసి రెండో భాగం ఆరు నెలలు గ్యాప్‌ విడుదల చేయాలని సుకుమార్‌ భావిస్తున్నట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. 

పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇందులో బన్నీబన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన పుష్పరాజ్‌ పాత్రకు సంబంధించిన వీడియో అభిమానుల తెగ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


 

మరిన్ని వార్తలు