Mega 154 Title Teaser: చిరు చేతిలో సిగరేట్‌.. ఫస్ట్‌​ గ్లింప్స్‌ అదుర్స్‌

23 Oct, 2022 11:45 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 24న ఉదయం 11.07 గంటలకు ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ విడుదల కానుంది. టీజర్‌ కంటే ముందు తాజాగా ఫస్ట్‌​ గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చిరంజీవి స్టైల్‌గా సిగరేట్‌ తాగుతుండగా.. పొగ అలా వస్తుంది. దేవీశ్రీ ప్రసాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది.

చిన్న గ్లింప్సే ఇలా ఉంటే.. రేపే రాబోతున్న టైటిల్‌ టీజర్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. చిరంజీవి 154వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అని టైటిల్‌ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నం నేపథ్యంలో సాగు గ్యాంగ్‌స్టర్‌-పోలీసు డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిసింది. ఇందులో రవితేజ ఓ కీలక పాత్ర పోషించగా, శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు