సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న నటి స్నేహ ఫ్యామిలీ ఫోటోలు

13 Aug, 2022 07:03 IST|Sakshi

తన సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటుడు ప్రసన్నతో జత కట్టి, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆయన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లల విషయంలో స్నేహ, ప్రసన్న స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు.

A post shared by Sneha (@realactress_sneha)

పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని అందమైన వేడుకగా నిర్వహించి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సంసార జీవితంలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా గురువారం ప్రసన్న, స్నేహ కొడుకు పుట్టిన రోజు. ఈ బాబుకు ఇప్పుడు ఏడేళ్లు. దీంతో పిల్లలను రెడీ చేసే పనిలో భాగంగా స్నేహ తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్‌ పూల్‌లో కాసేపు జలకాలాడారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.   

A post shared by Sneha (@realactress_sneha)

చదవండి: (తెలుగు పరిశ్రమ అలా ముందుకెళ్లాలి)

మరిన్ని వార్తలు