మిస్‌ సితారమిస్‌ సితార

4 Jun, 2021 01:11 IST|Sakshi

రాజీవ్‌ సిద్ధార్థ్, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన హిందీ చిత్రం ‘సితార’. ‘నోబుల్‌ మ్యాన్‌’ ఫేమ్‌ వందనా కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ కావాలనుకునే ఒక అమ్మాయి,  చెఫ్‌ కావాలనుకునే ఓ అబ్బాయి చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తాజాగా ఈ చిత్రంలోని శోభిత లుక్‌ను విడుదల చేశారు. చేతిలో పువ్వు  పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న శోభిత లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉంటే తెలుగులో ‘మేజర్‌’ చిత్రంలో నటించారు శోభిత. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లోనూ, అమెరికన్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘మంకీ మ్యాన్‌’లోనూ నటిస్తున్నారు. మలయాళంలో ఆమె నటించిన ‘కురూప్‌’ చిత్రం విడుదల కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు