సూపర్‌ సిరీస్‌..‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’

12 Nov, 2020 07:59 IST|Sakshi

పది ఎపిసోడ్స్‌ని వీక్షించిన 8 కోట్ల మంది

సిరీస్‌ క్రేజ్‌ని తారస్థాయికి తీసికెళ్లిన నెటిజన్లు

నటనలో జీవించిన హీరో, హీరోయిన్లు షన్నూ, చైతన్య 

తెలుగు తెరపై కొన్ని ఆణిముత్యాలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి.. ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి.. కొంతకాలంగా సోషల్‌ మీడియా హవా బాగా నడుస్తోంది. ప్రతి ఒక్కరి టాలెంట్‌కు యూట్యూబ్‌ ప్లాట్‌ఫాం ఇస్తుంది. ఇదే యూట్యూబ్‌ వేదికగా ఇటీవల విడుదలైన షార్ట్‌ఫిలిం ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌ని 80.6 మిలియన్స్‌ (8కోట్ల మంది) వీక్షించారు. అందరి మన్ననలు సొంతం చేసుకుని సౌత్‌లోనే సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ 

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌
ఇప్పటి వరకు ఈ పది ఎపిసోడ్స్‌ని 86 మిలియన్స్‌ ప్రజలు వీక్షించారు. 1.50 మిలియన్‌ మంది ఛానల్‌ను సబ్‌స్రై్కబ్‌ చేసుకున్నారు. అక్టోబర్‌ నెలలోనే 1.04 మిలియన్స్‌ సబ్‌స్రైబ్‌ చేసుకోవడంతో యూట్యూబ్‌లో సౌత్‌ ఇండియా రికార్డ్‌ నెలకొల్పింది.

వెబ్‌ సిరీస్‌ సూపర్‌హిట్
ఇన్‌ఫినిటమ్‌ మీడియా నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ సంస్థ నిర్మించిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ వెబ్‌ సిరీస్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ సిరీస్‌ను వీక్షిస్తున్నారు. ఈ సిరీస్‌లో జీవితాంతం గుర్తుండిపోయే క్యారెక్టర్‌ షన్నూ. లీడ్‌రోల్‌ చేసిన షన్నూ(షన్మఖ్‌ జశ్వంత్‌) తన యాక్టింగ్‌ స్కిల్స్‌తో విమర్శకుల్ని సైతం మెప్పించాడు. 
– షన్నూ(షన్ముఖ్‌ జశ్వంత్‌)

ఆసక్తికరమైన క్యారెక్టర్లు
ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరో రెండు ఆసక్తికరమైన క్యారెక్టర్లను పరిచయం చేశాడు దర్శకుడు సుబ్బు.కె. మేనేజర్‌గా ఉన్న అరవింద్‌(జయచంద్ర) తన కంపెనీలో చేసే ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చుతూ టైంకి పని చేపించుకుంటాడు. పిజ్జా, బర్గర్లు లాంటివి ఆర్డర్‌ చేస్తూ.. మా మేనేజర్‌ భలే మంచోడనే ట్యాగ్‌లైన్‌ని సొంతం చేసుకున్నాడు. 
 –మేనేజర్‌ అరవింద్‌(జయచంద్ర), హెచ్‌ఆర్‌ శృతి(శ్రీవిద్య)

లుక్స్‌తో ఫ్లాట్‌ చేసిన చైతన్య
ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ చేసిన వైష్ణవి చైతన్యకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. ప్రత్యేకంగా ఈ వెబ్‌సిరీస్‌లో పెద్ద పెద్ద స్టార్‌ హీరోయిన్స్‌ చేసిన మాదిరిగా చేయడం తనకు తానే సాటిగా మలుచుకుంది. తన లుక్స్, హావభావాలతో నెట్టింట్లోని ప్రతి అబ్బాయిని ఫ్లాట్‌ చేసింది. క్యూట్‌ లుక్స్, స్వీట్‌ వాయిస్‌తో షన్నూ మాట్లాడుతుంటే.. మొబైల్స్‌లో అది చూస్తున్న ప్రేక్షకుడు గాల్లో తేలిపోయారు.  
 –వైష్ణవి (వైష్ణవి చైతన్య)

హైప్‌ కోసం చేశా..
‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ అనేది నా మైండ్‌లో లేదు. సీజన్‌ టూ అని స్క్రిప్ట్‌ రాసుకున్నాను. సీజన్‌ టూ చేద్దాం అనుకునే సమయంలో సీజన్‌ వన్‌ చేయాలి కదా అన్నారు. సో, సీజన్‌ వన్‌కి ఏదైనా హైప్‌ తెస్తేనే.. సీజన్‌ టూకు క్రేజ్‌ వస్తుందనే ఐడియా వచి్చంది. అందుకే 10 ఎపిసోడ్స్‌తో ఉన్న ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ని చేశా. నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది.
– సుబ్బు.కె. డైరెక్టర్‌

ట్రెండింగ్‌ అవుతున్నాం..
మేం నమ్మి అవకాశం ఇచి్చనందుకు డైరెక్టర్‌ కె.సుబ్బు బాగా తీశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న క్రేజ్‌ చూస్తుంటే భలే ఆనందమేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మా సిరీస్‌నే ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్స్‌కి 100శాతం న్యాయం చేశారు. ఇదే స్ఫూర్తి, ఆనందంతో సీజన్‌ టూని ఇంతకన్నా క్వాలిటీగా, ప్రతి ప్రేక్షకుడూ మర్చిపోలేని విధంగా నిర్మించి తీరుతా.
–వందనా బండారు, ప్రొడ్యూసర్, ఇన్‌ఫినిటమ్‌ మీడియా నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌

మరిన్ని వార్తలు