మిస్టరీ ఆరంభం

25 Dec, 2020 06:13 IST|Sakshi
సాయితేజ్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, కార్తీక్‌ దండు

ఒకపక్క ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా విడుదలతో ఫుల్‌ బిజీగా ఉండి కూడా గురువారం తన నూతన చిత్రాన్ని ప్రారంభించారు సాయితేజ్‌. ‘సోలో బ్రతుకే...’ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ స్క్రీన్‌ప్లేను సమకూరుస్తున్నారు. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాయితేజ్‌ క్లాప్‌నిచ్చారు. సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి, కుమారుడు సుక్రాంత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ కార్తీక్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. మిస్టీరియస్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

మరిన్ని వార్తలు