సితార పేరుతో మోసాలు.. పోలీసులకు మహేశ్‌ బాబు టీమ్‌ ఫిర్యాదు

10 Feb, 2024 08:08 IST|Sakshi

టాలీవుడ్‌ ప్రముఖ హీరో మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుకు పోలీసులు ఫిర్యాదు అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో  నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులను ప్రజలకు పంపుతున్నట్లు ఘట్టమనేని మహేశ్‌ బాబు టీమ్‌ (GMB) గుర్తించింది. అలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌ను అక్కడ చేర్చుతూ మాదాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానస్పద లింకులు వస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది.

ఈ అంశాన్ని తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్‌ విడుదల చేశారు. అందులో ఇలా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని ఫోటోలు ఉపయోగించి కొందరు ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేసి డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని కొందరు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రేడింగ్, పెట్టుబడి లింక్‌లను పంపుతున్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పదంగా అనిపించిన తక్షణమే సంబంధించిన అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు.

మహేష్ బాబు టీమ్‌ ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అనుమానస్పద నోటిఫికేషన్‌కు స్పందించవద్దని అభిమానులకు మహేష్ టీమ్‌ సూచిస్తుంది. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామంటున్న సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

(సితార, నమ్రతకు సంబంధించిన ఒరిజినల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లింక్‌లు గమనించగలరు)

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

A post shared by sitara 🪩 (@sitaraghattamaneni)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega