Somy Ali: సిగరెట్‌తో కాల్చి ఆనందించేవాడు.. స్టార్‌ హీరోపై సంచలన ఆరోపణలు

6 Jan, 2023 17:31 IST|Sakshi

మాజీ బాలీవుడ్ నటి స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. నటి సోమీ అలీ ఇటీవల సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన వెబ్ షోను నిషేధించారని తెలిపింది. అంతేకాకుండా  డేటింగ్‌లో ఉన్నప్పుడు తనను శారీరకంగా వేధించాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది.  తాము ఎనిమిదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నట్లు సోమీ పేర్కొంది. సల్మాన్ ఖాన్, సోమీ అలీ 90వ దశకంలో డేటింగ్‌లో ఉన్నారు. 

'ఫైట్ ఆర్ ఫ్లైట్' అనే డాక్యుమెంట్ సిరీస్‌ను ఇండియాలో విడుదల చేయకుండా సల్మాన్ అడ్డుకున్నాడని ఆరోపించింది. ఇందులో ఆమె గృహ హింస, మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించే లక్ష్యంతో తీసినట్లు వెల్లడించింది. సల్మాన్‌తో  ఉన్న ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని వెల్లడించింది. 

'నా గాయాలను మేకప్‌తో కప్పుకోవాల్సి వచ్చింది'

సోమీ మాట్లాడుతూ..' నేను ముంబైలో ఉన్న సమయంలో సల్మాన్ నన్ను శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. నా పనిమనిషి కూడా  నన్ను కొట్టడం ఆపాలని సల్మాన్‌ను వేడుకుంది. ఆయన దెబ్బలు కనిపించకుండా నేను మేకప్‌తో కప్పుకోవాల్సి వచ్చింది. నిర్మాతలు కూడా తన గాయాలను చూశారు. సిగరెట్‌లో కాల్చిన గాయాలు చూసి సల్మాన్ ఆనందించేవాడు. అత్యంత దారుణమైన శారీరక, లైంగిక వేధింపులకు గురయ్యా.' అని తెలిపింది. 

సల్మాన్ శాడిస్ట్: సోమీ

సోమీ అలీ మాట్లాడుతూ.. 'తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా నెలల తరబడి మంచానికే పరిమితమయ్యా. సల్మాన్ ఒక్కసారి కూడా వచ్చి పరామర్శించలేదు. టబు సైతం పరామర్శకు వచ్చింది.  నేను నొప్పితో ఏడుస్తుంటే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. 2018లో నాకు వెన్ను శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. ఆ సమయంలో మీరు శారీరకంగా వేధింపులకు గురయ్యారా.' అని డాక్టర్ అడిగారని తెలిపింది. 

తలపై మద్యం పోసి..

సల్మాన్ తనపై మద్యం పోశాడని సోమీ ఆరోపించింది. సల్మాన్ ఒక న్యాయవాది ద్వారా తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఇప్పుడు కూడా తనకు అనేక ద్వేషపూరిత మెయిల్‌లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. తనకు ఎలాంటి ప్రచారం అవసరం లేదని.. నిజాలు ప్రజలకు తెలియాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. 

  "నేను ప్రతీకారం తీర్చుకోవడం లేదు. అతను చేసిన తప్పును ఒప్పుకోవాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. సల్మాన్ లాంటి వ్యక్తి అలా చేయడని నాకు తెలుసు. అతను అహంకారి. సల్మాన్ ఇకపై నన్ను భయపెట్టలేడు.' ఆమె తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. 

A post shared by Somy Ali (@realsomyali)

A post shared by Somy Ali (@realsomyali)


 

మరిన్ని వార్తలు