-

బాధితుల‌నే బాధ్యులు చేయ‌డాన్ని ఆపండి

23 Nov, 2020 21:21 IST|Sakshi

మీటూ మూమెంట్‌కు పూర్తి స్థాయి మ‌ద్ద‌తు తెలిపిన‌ సింగ‌ర్ సోనా మొహ‌పాత్ర ఇప్పుడో కొత్త చాలెంజ్‌కు తెర తీశారు. 'ఐ నెవ‌ర్ ఆస్క్ ఫ‌ర్ ఇట్' పేరిట బాధితుల‌నే బాధ్యులుగా చేసిన సంఘ‌ట‌న‌ల గురించి నిర్మొహ‌మాటంగా, నిర్భ‌యంగా స్పందించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌తిదానికి బాధితుల‌నే త‌ప్పుప‌ట్ట‌డం ఆపేయాల‌ని కోరారు. ముందుగా ఆమె త‌న కాలేజీలో జ‌రిగిన ఈవ్ టీజింగ్ గురించి చెప్పుకొచ్చారు. 'నేను బీటెక్ చ‌దువుతున్న చ‌దువుతున్న రోజుల‌వి..  స‌ల్వార్ దుస్తులు ధ‌రించిన నేను మైక్రోప్రాసెస్ ల్యాబ్‌కు వెళ్తున్నా. అక్క‌డ ఉన్న సీనియ‌ర్లు న‌న్ను చూసి విజిల్స్ వేశారు. నా లోదుస్తుల గురించి అంద‌రికీ విన‌బ‌డేలా ఏవేవో కామెంట్లు చేశారు. అది చూసిన ఓ వ్య‌క్తి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా చున్నీ స‌రిగా వేసుకోవ‌చ్చు కదా! అని స‌ల‌హా ఇచ్చాడు' అని చెప్పుకొచ్చారు. (చ‌ద‌వండి: క్షేమం కోరి...)

ఇలాంటి వేధింపులు మీకూ ఎదురైతే వాటిని పంచుకోండి అంటూ బాలీవుడ్ న‌టి సోన‌మ్ క‌పూర్‌తో పాటు సింగ‌ర్ చిన్మ‌యిని కూడా త‌న ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. కాగా సంగీత ద‌ర్శ‌కుడు అను మాలిక్ త‌న‌ను లైంగింక‌గా వేధించాడంటూ గ‌తంలో ఆమె సంచల‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విష‌యంలో కొంద‌రు ఆమెకు  స‌పోర్ట్ చేయ‌గా మ‌రికొంద‌రు మాత్రం ఆమెనే తిట్టిపోశారు. ఆరోప‌ణ‌లు చేసినందుకుగానూ సరిగ‌మ‌ప షో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమెను షో నుంచి వైదొల‌గాల‌ని ఒత్తిడి తెచ్చిన‌ట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. (చ‌ద‌వండి: టేకాఫ్‌కి ఆల్వేస్‌ రెడీ అంటున్న హీరోయిన్లు)

మరిన్ని వార్తలు