Sonakshi Sinha: హీరోయిన్‌ సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసు

6 Mar, 2022 15:15 IST|Sakshi

బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్‌ కేసులో ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు ప్రమోద్‌ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్‌ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు.

దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్‌ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్‌ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 
 

మరిన్ని వార్తలు