చిరంజీవి సినిమాలో హీరోయిన్‌, విలన్‌ ఖరారు!

24 Jun, 2021 08:02 IST|Sakshi

దాదాపు ఏడేళ్ల తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షీ సిన్హా సౌత్‌లో ఓ సినిమా ఒప్పుకున్నారు. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. చిరంజీవి సరసన జోడీ కట్టనున్నారామె. 2014లో రజనీకాంత్‌ సరసన చేసిన ‘లింగా’ తర్వాత దక్షాణాదిన సోనాక్షి చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవికి విలన్‌గా బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించనున్నారు. రజనీ ‘పేట’ తర్వాత దక్షిణాదిన నవాజుద్దీన్‌ చేయనున్న సినిమా ఇదే.

చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఓ సినిమా తెరకెక్కించనుంది. ఈ సినిమాతో సోనాక్షీ కథానాయికగా, నవాజుద్దీన్‌ ప్రతినాయకుడిగా తెలుగులోకి మెగా ఎంట్రీ ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్‌ ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్, మెహర్‌ రమేశ్‌ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి గనక చిరంజీవి–బాబీ సినిమా సెట్స్‌ పైకి వెళ్ళడానికి కాస్తంత సమయం పట్టేలా ఉంది.  

చదవండి: అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య

మరిన్ని వార్తలు