సంజయ్‌ లీలా భన్సాలీ వెబ్‌ సిరీస్‌ కోసం సోనాక్షి డేరింగ్‌ స్టేప్‌!

7 Jul, 2021 18:00 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా డేరింగ్‌ స్టేప్‌ తీసుకుంది. ‘ఆర్‌.. రాజ్‌కుమార్‌’, ‘దబాంగ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలల్లో నటించి మెప్పించిన సోనాక్షికి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వేశ్య పాత్రలో నంటించేందుకు రేడి అయ్యింది. దీంతో ఈ సమయంలో సోనాక్షి ఇలాంటి డేరింగ్‌ స్టేప్‌ తీసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రముఖ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ భారీ స్థాయిలో ‘హీరా మండి’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రెడ్‌లైట్‌ ఎరియా నేపథ్యంలో సెక్స్‌ వర్కర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వెబ్‌ సీరిస్‌ సాగనుంది. 

ఇందులో వేశ్య పాత్రలో నటించేందుకు సోనాక్షి తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆ పాత్రకు సంజయ్‌ లీలా భన్సాలీ సోనాక్షిని ఖరారు చేశారట. ఈ వెబ్‌ సిరీస్‌ కథ వివరించగానే సోనాక్షి తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను బట్టి మరు క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌లో వేశ్య పాత్ర కోసం సీనియర్‌ నటి మాధురి దీక్షిత్‌, హ్యూమా ఖురేషిల పేర్లు తెరపై రాగా చివరకు హ్యూమా ఖురేషిని దర్శకుడు ఓకే చేశాడు. తాజాగా మరో ప్రధాన వేశ్య పాత్రకు సోనాక్షిని కూడా ఎంపిక చేశారు.

ఇందులో సోనాక్షి కథక్‌ డ్యాన్సర్‌గా కనిపించనుండటంతో ఆమె కథక్‌ నేర్చుకునే పనిలో కూడా పడిందట. కాగా ఇది వరకు సోనాక్షి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చి ‘రౌడీ రాథోడో’ మూవీలో నటించింది. ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచిందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సంజయ్‌ లీలా భన్సాలీ ప్రస్తుతం అలియా భట్‌ ‘గంగూభాయ్‌ కథియావాడి’ మూవీని తెరెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తెయిన అనంతరం ‘హీరా మండి’ని తెరకెక్కించే ప్లాన్‌ ఉన్నాడు. దీనికోసం ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ప్టిక్స్‌తో చర్చలు కూడా జరపుతున్నాడట. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు