చిరు, బాలయ్యలతో బాలీవుడ్‌ భామ రొమాన్స్‌!

23 Mar, 2021 15:34 IST|Sakshi

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. టాలీవుడ్‌ హీరోలంతా పాన్‌ ఇండియా చిత్రాలవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తమ సినిమాల్లో బాలీవుడ్‌ హీరోయిన్లను పెట్టుకుంటున్నారు. పేరున్న హీరోయిన్‌ అయితే బాలీవుడ్‌లో పబ్లిసిటీకి ఈజీ అవుతుందని భావిస్తున్నారు. దీంతో బీ టౌన్‌లో ఫేమస్ అయిన హీరోయిన్స్‌పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేశారు. తమ సినిమాల్లో వారిని నటింపజేసేందుకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించుకుంటున్నారు.

ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌లో రాణిస్తుండగా, తాజాగా మరో యంగ్‌ హీరోయిన సోనాక్షి సిన్హా కూడా ఇక్కడ సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ఇద్దరు బడా హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అందులో చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాగా, మరొకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలకృష్ణ సినిమా. ఒకేసారి అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణతో ఈ భామ రొమాన్స్‌ చేయబోతుంది. ఈ రెండు ఆఫర్స్ సోనాక్షి వరకు చేరాయని, డేట్స్ విషయంలో ఆమె ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి బిబీ3లో నటిస్తున్నాడు.
చదవండి:
తలైవి ట్రైలర్‌ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు