The Ghost Movie: నాగార్జున 'ది ఘోస్ట్‌' చిత్రానికి హీరోయిన్‌ కష్టాలు.. ఫైనల్‌గా

26 Dec, 2021 17:46 IST|Sakshi

Sonal Chauhan Heroine In Nagarjunas The Ghost Movie: టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇటు బుల్లితెరపై, అటు వెండితెరపై తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. మొన్నటిదాకా బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌తో అలరించిన నాగ్‌.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించాడు. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌  ఓటీటీకి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని తెలిసిందే. మరోవైపు సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు నాగార్జున. ఇటీవల 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు కింగ్‌ నాగ్‌ స్వయంగా ప్రకటించాడు. అలాగే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్‌ను అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు. 

విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథానాయికగా చాలా మంది హీరోయిన్లను పరిశీలించారట. అయితే ఇందులో హీరోయిన్‌ పాత్ర ఒక గూఢచారి. ఇందుకోసం మొదట చందమామ కాజల్‌ అగర్వాల్‌ను మేకర్స్ సెలెక్ట్‌ చేశారని సమాచారం. కాజల్‌తో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. అయితే పలు అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి కాజల్‌ తప్పుకుందని తెలుస్తోంది. తర్వాత అమలాపాల్‌ను ఎంపిక చేసి కొన్ని రోజులు షూటింగ్‌ చేసిన తర్వాత ఆమె కూడా మూవీ నుంచి తప్పుకుందట. తర్వాత చిత్రబృందం ఎఫ్‌2 ఫేమ్‌ మెహ్రీన్‌ను సంప్రదించింది. ఆమె పారితోషికాన్ని భారీగా డిమాండ్‌ చేయడంతో నిర్మాతలు వెనక్కితగ్గారట. 

ఇక చేసేదేం లేక హీరోయిన్‌ వేటలో పడిందట 'ది ఘోస్ట్‌' చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమాకు హీరోయిన్‌ జాబితాలో సోనాల్‌ చౌహన్‌ పేరు ఉన్నట్లు సమాచారం. చిత్రంలో గూఢచారి పాత్రలో ఆఖరిగా సోనాల్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న 'ది ఘోస్ట్' మూవీలో నాగార్జున మాజీ 'రా' అధికారిగా కనిపించనున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదీవరకు 'వైల్డ్‌ డాగ్‌' చిత్రంలో 'ఎన్‌ఐఏ' అధికారిగా నటించారు నాగార్జున. 


ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తి.. నాగార్జున ట్వీట్‌

మరిన్ని వార్తలు