ఆ హీరోయిన్‌కు ప్రియుడు దొరికేశాడట!

1 Jul, 2021 15:47 IST|Sakshi

సోనమ్‌ బజ్వా.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు. సుశాంత్‌ సరసన 'ఆటాడుకుందాం రా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత తమిళంలో కప్పాల్‌ అనే సినిమా చేసింది. తమిళనాట బాగా ఆడిన ఈ సినిమా తెలుగులో 'పాండవుల్లో ఒకరు' చిత్రం పేరుతో డబ్‌ అయింది. కానీ తన మాతృభాష పంజాబీలో వరుస సినిమాలు చేయడంతో టాలీవుడ్‌ మీద దృష్టి సారించలేకపోయింది. తెలుగులో అవకాశాలు వచ్చినా అవేవీ తనకు పెద్దగా నచ్చకపోవడంతో దాదాపు ఇక్కడి ఇండస్ట్రీకి దూరమైపోయింది.

సోనమ్‌, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తోనూ లవ్‌ ట్రాక్‌ నడిపిందని ఆ మధ్య పుకార్లు మొదలయ్యాయి. 2018లో సోనమ్‌ తన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సూర్యాస్తమయాన్ని చూస్తూ నీకోసం ఆలోచిస్తున్నా అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీనికి కేఎల్‌ రాహుల్‌.. ఒక్క ఫోన్‌ కొడితే అక్కడ వాలిపోతా అని కామెంట్‌ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ బలంగా నమ్మారు. కానీ తర్వాత రాహుల్‌.. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురు అతియా శెట్టికి దగ్గరవడం గమనార్హం.

ఇదిలావుంటే తాజాగా సోనమ్‌ బజ్వా ప్రేమలో పడిందట. తను మనసు పారేసుకున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవాడు కాదట. అతడు కూడా ముంబైలో ఉంటున్నాడని, కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి.

చదవండి: భార్య అకౌంట్‌ నుంచి రూ.కోటి విత్‌ డ్రా.. టీవీ నటుడిపై కేసు

మరిన్ని వార్తలు