ఇది ప్రారంభం మాత్రమే!

21 Aug, 2022 04:30 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ ఇంట     ఆనందం వెల్లి విరిసింది. ఆమె మగబిడ్డకు         జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారామె.       ‘శనివారం ఉదయం కొడుకు పుట్టాడు..             2022 ఆగస్టు 20న ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు.

ఇది ప్రారంభం మాత్రమే. చిన్నారి రాకతో మా జీవితాలు మారిపోతాయనే విషయం మాకు తెలుసు’      అంటూ ఆమె పోస్ట్‌ చేశారు. కాగా సోనమ్‌ కపూర్, ఆనంద్‌ అహుజాలు 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు సోనమ్‌. ఆ తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నారు.            సోనమ్‌–అహూజా తల్లితండ్రులయిన సందర్భంగా పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు