వాచిపోయిన కాళ్లు... సోషల్‌ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్‌ కపూర్‌

5 Aug, 2022 12:31 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! తాజాగా ఆమె తన కాళ్లు వాచిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అమ్మ కావడానికి చేసే ప్రయాణం అంత అందంగా ఏమీ ఉండదు అని రాసుకొచ్చింది. ఫొటో చూస్తుంటే కాళ్లు వాయడంతో తను ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కాగా సోనమ్, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు.

ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ హీరోయిన్‌. అప్పటినుంచి తన ప్రతి కదలికను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. మెటర్నటీ షూట్‌ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి.

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

చదవండి: సింపుల్‌గా కనిపిస్తున్న ప్రభాస్‌ టీషర్ట్‌ అంత ఖరీదా?
‘సీతారామం’ టాక్‌ ఎలా ఉందంటే...

మరిన్ని వార్తలు