సూపర్‌ స్టెప్‌

21 Sep, 2020 05:56 IST|Sakshi

కల్యాణ్‌దేవ్, రచితారామ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్‌మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రిజ్వాన్, ఖుషీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్‌  పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని  ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్‌ దేవ్‌తో పాటు నట కిరీటి రాజేంద్రప్రసాద్‌ ఈ పాటలో నటిస్తున్నారు. ఇద్దరూ సూపర్‌ స్టెప్పులేస్తున్నారని చిత్రబృందం పేర్కొంది. తమన్‌ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా, అనీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటతో పాటు మరో పాట చిత్రీకరిస్తే సినిమా పూర్తయినట్లే. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్‌స్టోరీ మిక్స్‌ చేసిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మా ‘సూపర్‌మచ్చి’. కల్యాణ్‌దేవ్‌ నటన, రచితారామ్‌ సినిమాకు ప్లస్సవుతుంది. తమన్‌ సంగీతం మా సినిమాకు హైలెట్‌ అవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు