‘మిమ్మల్ని సొంతగడ్డకు చేర్చేవరకు ఆగను’

12 Aug, 2020 19:09 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కాలంలో వలస కూలీలను ప్రత్యేక విమానంలో వారి సొంత రాష్ట్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సమస్యల్లో ఉన్న పేదవారికి తోచిన సాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న మన భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు మరోసారి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానం ఆగస్టు 14న మనీలా నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నట్లు సోనూ సూద్ స్వయంగా ‌ట్విటర్‌లో ప్రకటించారు. (చదవండి: నువ్వు చాలా అదృష్టవంతుడివి.. బుక్స్‌ ఇస్తాను)

ఇది ఫేజ్-2 అంటూ సోనూ సూద్ ట్వీట్‌ చేస్తూ.. ‘‘భారత్‌-పిలిప్పీన్స్‌.. మీ కుటుంబాలను కలుసుకునేందుకు మీరంతా  సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మనీలా నుంచి ఢిల్లీకి ఆగస్టు 14న సాయంత్రం 7.10 గంటలకు ఎస్జీ9286 అనే విమానం బయల్దేరబోతోంది. మిమ్మల్ని ఆ విమానంలో ఎక్కించుకుని సొంతగడ్డకు చేర్చాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే సోనూ సూద్‌ ఫిలిప్పీన్స్‌కు విమానాన్ని పంపించడం ఇది రెండవ సారి. కొన్నిరోజుల కిందట మనీలా నుంచి తొలి విమానం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అంతేగాక కజకస్థాన్‌లో చిక్కుకున్న మన తెలుగు వారి కోసం కూడా మరోక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు సోనూ సూద్‌ మరో ట్వీట్‌లో‌ తెలిపారు. ఇది ఆగస్టు 14న కజక‌స్థాన్‌ బయల్దేరడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోనూ సూద్‌ వెల్లడించారు. (చదవండి: కొత్త ఇల్లు: సోనూ సూద్ రాఖీ గిఫ్ట్‌)

మరిన్ని వార్తలు