Sonu Sood: సెట్‌లో హీరోయిన్‌ ముందు‘ రియల్‌ హీరో’ కంటతడి

11 Aug, 2021 19:18 IST|Sakshi

రియల్‌ హీరో సోనూసూద్‌ షూటింగ్‌ సెట్‌లో కంటతడి పెట్టాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచి ధైర్యం చెప్పిన ఈ గొప్ప మానవతావాది.. సెట్‌లో, అదీ కూడా హీరోయిన్‌ ముందు ఎందుకు ఏడ్చాడనేగా మీ అనుమానం. దానికి ఒక కారణం ఉంది.

ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ దర్శకత్వంలో  సోనూ సూద్‌, నిధీ అగర్వాల్‌ జంటగా ‘సాత్‌ క్యా నిభావోగే’పాట  తెరకెక్కిన విషయం తెలిసిందే. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడిన సూపర్ డూపర్ హిట్ ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ ఇది. ఈ పాటలో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది.  ఈ పాటను టోనీ కక్కర్‌ రచించడంతో పాటు అల్లాఫ్‌రాజ్‌తో కలిసిఆలపించాడు. ఈ నెల 9న ఈ పాట విడుదలైంది. అయితే దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను సోనూసూద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో ఆయన హీరోయిన్‌ కూర్చున కెమెరా ట్రాలీ లాగుతూ కనిపించారు. ‘ఓ హిట్‌ సాంగ్‌ తీయాలంటే ఎంతో కష్టపడాలి’ అంటూ కంట తడిపెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అయింది.  

A post shared by Sonu Sood (@sonu_sood)

చక్కని ప్రేమ కథ
ఈ వీడియో లో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. కొంతమంది గుండాలను పట్టుకోవడానికి పోలీస్ అధికారి సోనూసూద్ పబ్ లోకి ఎంటర్ అయ్యి, వారిని పట్టుకుంటాడు. అదే పబ్ లో అతని మాజీ ప్రేయసి నిధి అగర్వాల్ డాన్సర్ గా ఉండటం చూసి ఆశ్యర్యపోతాడు. అతన్ని పోలీస్ ఆఫీస్ గా చూసి ఆమె కూడా షాక్ కు గురవుతుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ళ క్రితం పల్లెటూరిలో జరిగిన ప్రేమాయణాన్ని ఫరాఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. అనివార్య పరిస్థితుల్లో సోనూకు నిధి దూరమై పోతుంది. అయితే తిరిగి వాళ్ళిద్దరూ ఇలా కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు