బాలీవుడ్‌లోకి క్రాక్.. హీరోగా సోనూసూద్!

16 Jan, 2021 15:35 IST|Sakshi

‘డాన్‌ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘క్రాక్‌’. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తుంది. కొత్త ఏడాది తొలి భారీ విజయం అందుకున్న ఈ సినిమాను హిందీలోకి రీమేక్‌ చేయనున్నారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీపడుతున్నట్లు తెలుస్తుంది.
(చదవండి : ‘క్రాక్‌’ మూవీ రివ్యూ)

ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ హీరోగా పేరొందిన సోనూసూద్ 'క్రాక్'ను బాలీవుడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాను సోనూ సూద్ స్వయంగా నిర్మించబోతున్నారట.హిందీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే నిర్మాత బి.మధును సోనూ సూద్ సంప్రదించారని.. ప్రస్తుతం వారిద్దరి మధ్య బేరసారాలు జరుగుతున్నాయని వినికిడి. మరి ఈ వార్త నిజమే అయితే హీరోగా సోనూ సూద్ తొలి హిందీ చిత్రం ‘క్రాక్’ రీమేక్ అవుతుంది. అయితే, దీనికి గోపీచంద్‌ మలినేనిని దర్శకుడిగా తీసుకుంటాడా? లేక హిందీ పరిశ్రమకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటాడా? అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.  కాగా, సోనూ సూద్ తెలుగులో తాజాగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు