సోనూసూద్‌ క్రేజ్‌; ‘ఆచార్య’లో ముఖ్య పాత్ర

29 Jul, 2020 15:39 IST|Sakshi

సోనూ సూద్‌... మొన్నటి వరకు ఈ పేరు వింటే ఎవరైనా విలన్‌​ లేదా యాక్టర్‌ అని చెప్పేవారు. తెలుగువారికి మాత్రం ‘నిన్ను వదల బొమ్మాళి’ అంటూ పశుపతి గుర్తుకొచ్చేవాడు. కానీ లాక్‌డౌన్‌ తరువాత మాత్రం  పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సోనూ సూద్‌ అంటే ఒక మంచి మనసున్న మనిషి అని, ఎవరికి  సాయం  కావాలన్నా ముందుటాడని అంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక అల్లాడిపోతున్న వలస కూలీలను ఆదుకొని సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకున్నాడు. ఇండియాలో ఉన్నవారినే కాకుండా విదేశాలలో చిక్కుకుపోయిన వారిని  కూడా తీసుకురావడానికి సాయాన్ని అందించారు. అదొక్కటే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను సోనూసూద్‌ చేస్తున్నారు. (‘సాఫ్ట్‌వేర్‌ శారద’కు సోనూసూద్‌ జాబ్‌)

ఇక సినిమాల విషయానికి వస్తే ఆచార్య సినిమాలో తాను నటిస్తున్నానని సోను తెలిపారు. దానికి సంబంధించిన షూటింగ్‌ కూడా  కొంత వరకు అయ్యిందని తెలిపారు. ఇంకా సెకెండ్‌ షెడ్యూల్‌ మొదలవ్వాల్సి ఉందని తెలిపారు. అయితే సినిమాలో తనది చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని చెప్పిన సోనూ సూద్‌ నెగిటివ్‌ రోలా? పాజిటివ్‌ రోలా అన్నది చెప్పలేదు. సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నని చెప్పారు. ఇకపై ఈ రియల్‌ హీరోని వెండితెరపై విలన్‌గా చూడలేమని చాలా మంది అభిమానులు అంటున్నారు. అందుకే చాలా మంది హీరో రోల్స్‌ ఇస్తామని అప్రోచ్‌ అవుతున్నారని కూడా సోనూ తెలిపారు. మున్ముందు సోనూసూద్‌ ఎలాంటి రోల్స్‌ చేయబోతున్నారో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.  

చదవండి: సోనూసూద్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు