రైతుకి సాయం

27 Jul, 2020 07:32 IST|Sakshi
సోనూసూద్‌

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులను బస్సుల్లో, విమానంలో వారి సొంత ఊర్లకు పంపించారు నటుడు సోనూ సూద్‌. అంతేకాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓ యాప్‌ని ప్రారంభించారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు వ్యవసాయం కోసం ఓ ట్రాక్టర్‌ని కొనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా కె.వి. పల్లి మండలం మహల్‌ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకి కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బుల్లేవు.

ఖరీఫ్‌ విత్తనాలు విత్తేందుకు ఎద్దులకు డబ్బులు లేకపోవడంతో తన ఇద్దరు కుమార్తెలను ఎద్దుల స్థానంలో ఉంచి పొలం దుక్కి దున్నారు. ఈ వీడియో వైరల్‌ అయింది. వీడియో చూసిన సోనూసూద్‌ ఆ కుటుంబానికి ఎద్దులు కొనిస్తానని ట్వీటర్‌ వేదికగా ఆదివారం ప్రకటించారు. ఆ తర్వాత మరో పోస్టులో ‘‘ఆ రైతు ట్రాక్టర్‌కి అర్హుడు.. అందుకే  ఎద్దులు కాదు.. ట్రాక్టర్‌ కొనిస్తాను.. ఈ రోజు సాయంత్రంలోపు ట్రాక్టర్‌ వారికి అందుతుంది.. వారి పిల్లలు చదువుపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. అన్నట్టుగానే ఆదివారం సాయంత్రానికి నాగేÔ¶ ్వరరావు కుటుంబానికి దాదాపు రూ.8లక్షలు విలువ చేసే ట్రాక్టర్, రోటోవేటర్‌ అందేలా చేశారు సోనూసూద్‌.

మరిన్ని వార్తలు