ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్‌ ప్రశంసలు.. కారణమిదే..

27 May, 2021 17:07 IST|Sakshi

ప్రముఖ తెలుగు యాంకర్‌ వింధ్యా విశాఖపై నటుడు సోనూసూద్‌ ప్రశంసలు కురిపించారు. నిజమైన రాక్‌స్టార్‌ అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా వింధ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో సోనూసూద్‌ మాట్లాడుతూ..హాయ్‌ వింధ్యా విశాఖ.. మీరు చేసిన సాయానికి చిన్న ‘థాంక్స్‌’ అనే పదం సరిపోదు. సోనూసూద్‌ ఫౌండేషన్‌పై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు నిజమైన రాక్‌స్టార్‌. మీరు చేసిన సహాయం పేదల ముఖాలపై నవ్వులు వెలిగిస్తుంది.. మీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి అంటూ పేర్కొన్నారు. 


గతేడాది కరోనా ప్రారంభం నుంచి సోనూసూద్‌ ఎంతో మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్‌ ఫౌండేషన్‌ పేరుతో విరాళాలు సేకరించి ఎంతో మందికి సత్వర సాయమందిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్‌ వింధ్యా కూడా తన వంతు సాయంగా సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చింది. తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు పంపించింది. దీనిపై స్పందించిన సోనూసూద్‌ యాంకర్‌ వింధ్యాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఇక సోనూసూద్‌ స్వయంగా తనకు బదితులివ్వడంపై ఆమె ఎంతో సంతోషించింది. ఈ వీడియో చూసి మాటలు రావడం లేదని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక యాంకర్‌ వింధ్యా విశాఖ పలు టీవీ షోలతో పాటు ఐపీఎల్‌, ప్రొ కబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. 

A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka)

చదవండి : ‘అలా చేసి సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు విరాళం ఇస్తా, మద్దతు ఇవ్వండి’
నా దృష్టిలో నాగలక్ష్మి అత్యంత ధనవంతురాలు: సోనూసూద్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు