సోనూ సూద్‌.. మరో సాయం

29 Jul, 2020 18:31 IST|Sakshi

ముంబై: కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూ సూద్‌. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు సోనూ సూద్‌. సాయం కావాలని ఎవరైనా కోరితే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు సోనూ సూద్‌. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అనుపమ్‌ శ్యామ్‌కు సాయం చేస్తానని ట్విటర్‌ వేదికగా వెల్లడించారు సోనూ సూద్‌. అనుపమ్‌ కుటుంబాన్ని కలిసి తగిన సాయం చేస్తానని వెల్లడించారు. (ఆస్పత్రిలో నటుడు.. ఆర్థిక సాయం కావాలంటూ..!)

గత కొంత కాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన అనుపమ్‌ రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నాడని చికిత్స కోసం ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అనుపమ్‌ సోదరుడు అనురాగ్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో ట్విటర్‌ యూజర్‌ ఒకరు అనుపమ్‌ శ్యామ్‌ వైద్యానికి ఆర్థిక సాయం చేయాలంటూ సోనూ సూద్‌ను ట్యాగ్‌ చేశాడు. దీనిపై స్పందించి.. అనుపమ్‌ శ్యామ్‌ను ఆదుకుంటానని సోనూ సూద్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి పలు సహాయ కార్యక్రమాలు చేయడం కోసం సోనూ సూద్‌ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. (సోనూసూద్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా