చిరు సార్‌ ఇబ్బంది పడ్డారు: సోనూసూద్‌

20 Dec, 2020 14:30 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో ముంబైలో చిక్కుకుపోయిన ఎంతో మంది కార్మికులకు విశేషమైన సేవలందించి అభిమానుల గుండెల్లో రియల్‌ హీరోగా మారాడు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. కరోనా కారణంగా ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించిన ఆయన దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. వలస కార్మికులను స్వస్థలాలకు చేరుకోవడంలో ఆయన చేసిన కృషి జాతీయ దృష్టిని ఆకర్షించింది. లాక్‌డౌన్‌లో ప్రారంభమైన సోనూసూద్‌ సేవలు నేటికి కొనసాగుతున్నాయి. తను చేసిన సాయాన్ని గుర్తిస్తూ ఎంతోమంది నిర్మాతలు తమ సినిమాల్లో హీరో పాత్రల కోసం అడుగుతున్నారని సోనూసూద్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. చదవండి: సోనూసూద్‌కు పద్మసేవా పురస్కార ప్రదానం

ఈ క్రమంలో తాజాగా ‘వీ ద వుమెన్‌’ వర్చువల్‌ సెషన్‌లో సోనూసూద్‌ శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా 2020 ఏడాది తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు. ‘నాకు హీరో రోల్స్‌ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే అద్భుతమైన నాలుగైదు కథలు ఉన్నాయి. ఇది జీవితంలో కొత్త ఆరంభంగా భావిస్తున్నాను. ఇటీవల నేను ఆచార్య షూట్‌లో పాల్గొన్నాను. చిరంజీవి సార్‌తో కలిసి యాక్షన్‌ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. షూట్‌ సమయంలో చిరంజీవి నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ సినిమాలో ఉండటం మాకు పెద్ద సమస్యంగా మారుతోందన్నారు. ఎంతోమందికి సేవలు అందించి ప్రజల గుండెల్లో నువ్వు మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నావు. యాక్షన్‌ సన్నివేశాల్లో నేను నిన్ను కొట్టాలంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒకవేళ నిన్ను కొడితే ప్రజలు నన్ను తిట్టుకుంటారు. అలాగే ఓ సన్నివేశంలో చిరంజీవి నాపై కాలు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా రీషూట్‌ చేశాం. అని ఆచార్య షూట్‌ సందర్భాలను గుర్తు చేసుకున్నారు. చదవండి: సీఎం జగన్‌కు మెగాస్టార్‌ కృతజ్ఞతలు

మరిన్ని వార్తలు