‘సాఫ్ట్‌వేర్‌ శారద’కు సోనూసూద్‌ జాబ్‌

28 Jul, 2020 13:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన టెకీ శారదకు తన వంతు సహాయం చేస్తానని నటుడు సోనూసూద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తన ప్రతినిధి ఆమెకు జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ అందించినట్లు సోనూసూద్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన శారద జీవితంపై ‘సాక్షి’వెలువరించిన కథనంపై స్పందించాల్సిందిగా కోరిన ఓ నెటిజన్‌ విజ్ఞప్తిపై.. ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘మా ప్రతినిధి తనను కలిశారు. ఇంటర్వ్యూ పూర్తైంది. జాబ్‌ లెటర్‌ కూడా పంపించాం. జై హింద్‌’’అని సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు.(సోనూ భాయ్‌కే పన్నులు కట్టేద్దాం!)

కాగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శారద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె జీవన గమనంపై ‘సాక్షి’ వెలువరించిన కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడాల్సిన పనిలేదని, బతికేందుకు ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయన్న ఆమె మాటలు యువతరానికి ఆదర్శంగా నిలిచాయి. ఈ క్రమంలో సమస్యలకు ఎదురొడ్డి పోరాడాలన్న శారద కథనం.. ‘రియల్‌ హీరో’ సోనూసూద్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఈ మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో వారందరి కోసం సోనూ సూద్‌ ఓ కొత్త యాప్‌ను తయారు చేయించిన విషయం విదితమే. ఈ యాప్‌ ద్వారా అవసరంలో ఉన్నవారి అర్హతలను బట్టి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు.(8 లక్షల ట్రాక్టర్, రొటావేటర్..)

యాప్‌తో ఉద్యోగం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు