హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. వీడియో వైరల్‌

28 Jul, 2021 17:14 IST|Sakshi

సోనూసూద్‌.. ఇతని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సాయం అనే పదం ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్.. కొద్ది రోజుల నుంచి కొత్త అవతారం ఎత్తి మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. సోనూసూద్ దా పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే’ అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

ఇటీవలే రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి ఆయన కంట పడటంతో వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నాడు. ఇక తాజాగా సోనూ కొత్త అవతారం ఎత్తాడు. ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయాడు.  ఈ క్రమంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపు వద్దకు వచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్‌ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మాడు. కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విటర్‌లో షేర్‌చేశాడు. ఇలా తనదైన స్టైల్‌లో చిరు వ్యాపారులకు సోనూ సపోర్టు చేస్తుండటంతో ఆయన చేసిన ఈ పనిపై మరోసారి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని వార్తలు