సోనూ సూద్‌ సాయంపై అనుమానం..

27 Oct, 2020 15:07 IST|Sakshi

ముంబై: ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయూత అందిస్తూ.. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకుంటూ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు నటుడు సోనూ సూద్‌. ఆయన సాయంపై ఓ నెటిజన్‌ అనుమానం వ్యక్తి చేశాడు. దీంతో ఆధారాలతో సహా అతడి అనుమానం తీర్చారు. ఇటీవల ఓ వ్యక్తి తన వైద్యానికి సాయం చేయాలని ట్విటర్‌ వేదికగా కోరగా అతడికి సహాయం చేసినట్లు సోనూ సూద్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సదరు నెటిజన్‌ స్పందిస్తూ ఆయనపై అనుమానం వ్యక్తం చేశాడు. అంతేగాక సాయం కోరిన వ్యక్తి చేసిన ట్వీట్‌లో అతడికి సంబంధించిన వివరాలు ఏవి లేకుండానే ఎలా స్పందించారని ప్రశ్నించాడు. అతడిది కొత్త ట్విటర్‌ అకౌంట్‌ అని కేవలం ఇద్దరూ ఫాలోవర్స్‌ మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నాడు. తన వైద్యానికి సహాయం చేయాల్సిందిగా అతడు ఒకే ఒక ట్వీట్‌ మాత్రమే చేశాడన్నాడని, అంతకు మించి అతడు ఎలాంటి అడ్రస్‌ ఇవ్వలేదన్నాడు. పైగా అతడు సోనూ సూద్‌ను కూడా ట్యాగ్‌ చేయలేదని, కనీసం లోకేషన్‌ కూడా చెప్పలేదన్నాడు. అతడి ట్వీట్‌కు ఎలా స్పందించారని, సాయం ఎలా చేశారని.. గతంలో కూడా ఆయనను సాయం కోరుతూ వచ్చిన ట్వీట్‌లు ఇప్పుడు కనిపించడం లేదన్నాడు. (చదవండి: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం)

దీనిపై సోనూ సూద్‌ స్పందిస్తూ.. ‘అదే గొప్ప విషయం బ్రదర్‌. ఇబ్బందుల్లో ఉన్నవారిని నేను గుర్తిస్తాను. అలాగే కష్టాల్లో ఉన్నవారు నన్ను ఆశ్రయిస్తారు. ఇవి చిత్తశుద్ధికి సంబంధించిన విషయాలు. ఇలాంటివి మీకు అర్థం కావు’ అంటూ తనదైన శైలిలో సోనూ సూద్‌ సమాధానం ఇచ్చారు. అంతేగాక తన సాయం పొందుతున్న ఆ వ్యక్తి రేపు ఎస్‌ఆర్‌సీసీ ఆసుపత్రిలో ఉంటాడని, వీలైతే అతడికి సాయం చేయాలని సదరు నెటిజన్‌కు సూచిస్తూ.. రోగికి సంబంధించిన వివరాలను కూడా షేర్‌ చేశారు. కాగా లాక్‌డౌన్‌ ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలను తరలించిన విషయం తెలిసిందే. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాక ఇబ్బందుల్లో ఉన్నవారికి అడగకుండానే సాయం చేస్తూ సోనూ సూద్‌ ఉదారతను చాటుకుంటున్నారు. (చదవండి: సరిగ్గా ఈ రోజే జీవితం చేజారింది: సోనూ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా