సోనూ ఉండుంటే ఆ సినిమా మరోస్థాయిలో ఉండేది

5 Oct, 2020 11:47 IST|Sakshi

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ సదాశివ్‌ పాత్రలో నటించేందుకు అంగీకరించగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి తన సిక్స్ ప్యాక్‌తో కండల వీరుడిగా, గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్‌ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీనికి 'జీవితంలో మంచి కోసం నడవండి... ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు' అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్‌ చేశారు. 

ఈ ఫొటో చూసిన ప్రేక్షకులు సోనూ సినిమాలో నటించి ఉంటే మణికర్ణిక మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అప్పట్లో కొన్ని రూమర్స్‌ వినిపించాయి. చిత్రంలో మార్పులు చేయాలని, సోనూసూద్‌ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్‌ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కంగన స్క్రిప్టులో మార్పులు చేశారనే ప్రచారం జరిగింది.  (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్‌)

Walk towards the good in life and one day you will arrive ❣️#throwback

A post shared by Sonu Sood (@sonu_sood) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు