సోనూ సూద్‌ ఎంట్రీ

29 Sep, 2020 02:33 IST|Sakshi
‘సంతోష్‌’ శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్, ఛోటా కె.నాయుడు, ప్రకాష్‌రాజ్, నభా నటేశ్, సోనూ సూద్, బ్రహ్మాజీ

‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్‌ సోమవారం షూటింగ్‌లో ఎంటర్‌ అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్‌’ టైటిల్‌కు, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు చక్కని రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్‌ రాజ్, సోనూ సూద్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా