సోనూసూద్‌ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు

30 Jul, 2020 18:18 IST|Sakshi

ముంబై: వెండితెరపై ఆయన భయంకరమైన విలన్‌. కానీ రియల్‌గా మాత్రం మంచి మనుసున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి చేయూత అందిస్తున్న రియల్‌ హీరో నటుడు సోనూసూద్‌. ఈ రోజు (గురువారం) జూలై 30 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వలస కార్మికులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. వారిని ఆదుకునేందుకు మరో ముందడుగుడు వేశాడు. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్‌గర్‌.కామ్‌లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి’’ అంటూ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో వలస జీవులను తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి గ్రామాలకు చేర్చిన విషయం తెలిసిందే. (చదవండి: భావోద్వేగం, సోనూ సూద్‌ కంటతడి!)

ఈ విషయంలో తనకు మద్దతుగా వచ్చిన పలు సం‍స్థలు ధన్యవాదాలు తెలిపాడు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చిన సోనూసూద్‌ ఆ తర్వాత కూడా నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పేద రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియోకు చలించిన ఆయన ఏకంగా ట్రాక్టర్‌ను కొని పంపించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడి చికిత్సకు డబ్బు సాయం చేశాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శారదకు ఉద్యోగం​ కూడా ఇప్పించాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తూ సోనూసూద్‌ అందరి మన్ననలు పొందున్నాడు. (చదవండి: చిరున‌వ్వుతో న‌మ‌స్క‌రించాలి: సోనూసూద్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు