సోనూసూద్‌ మరో ఘనత

16 Apr, 2021 09:13 IST|Sakshi

రియల్‌ హీరో సోనూసూద్‌కు సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌

60 లక్షల మార్క్‌ను అధిగమించిన సోనూ ట్విటర్‌ ఫాలోవర్లు

సాక్షి, ముంబై:  ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి ఘనతను సాధించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కాలంలో మానవత్వాన్ని చాటుకుని సగటు జీవి పట్ల రియల్‌ హీరోగా నిలిచిన సోనూసూద్‌కు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ మామూలుది కాదు. ఫలితమే ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. ప్రస్తుతం ట్విటర్‌లో  సోనూ ఫోలోవర్ల సంఖ్య  6 మిలియన్ల మార్కును  అధిగమించడం విశేషం. దీంతో  అభిమానులు సోనూసూద్‌కు  ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.  (‘రియల్‌ హీరో’ సోనూసూద్‌కి అరుదైన గౌరవం)

సంక్షోభంలో చిక్కుకున్న వలస కార్మికుల పాలిట ఆపద్భాంధవుడిగా సోనూసూద్‌ అందించిన సేవలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన సోనూ..రియల్ లైఫ్‏లో తన దాతృత్వానికి హద్దులే లేవంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారి గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికీ తన సేవానిరతిని కొనసాగిస్తున్న కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అనేక సాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ సాయానికి మరో పేరుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడుతున్నావారికి కీలకమైన మందులను అందిస్తున్నారు. అలాగే  కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో  తన వంతుగా 10 ఆక్సిజన్ సిలిండర్లను అందించారు. అంతేకాదు తమ వంతు సాయం  అందిచి, పలువురి  ప్రాణాలు కాపాడాలని  కూడా ఆయన  తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు.

కాగా సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్‌ రైడ్‌ ఫర్‌ అవర్‌ స్టూడెంట్స్‌ అంటూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ  సందడి చేశారు. ఆ  ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు