రియల్ హీరోకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

28 Sep, 2020 16:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కరోనా, లాక్‌డౌన్‌ అనంతరం టాలీవుడ్ లో తెలుగు సినిమాల  షూటింగ్ సందడి మొదలైంది. ఈ క్రమంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా మూవీ 'అల్లుడు అదుర్స్' మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. సోమవారం హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమం తిరిగి  ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లాక్‌డౌన్‌  హీరో  సోనూసూద్ కు  ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా రియల్ హీరో సోనూసూద్ లోకేషన్ లోకి ఎంటర్ కాగానే యూనిట్ సిబ్బంది అంతా చప్పట్లతో, ఉత్సాహంగా  సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ రాజ్ సోనూకు శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు ఓ జ్ఞాపికను కూడా బహూకరించారు. ఈ క్రమంలో అల్లుడు అదుర్స్ సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కష్టకాలంలో వలసకార్మికులకు అండగా నిలిచిన సోనూను మనస్ఫూర్తిగా అభినందించారు.(ఏసర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోనూ సూద్..)

బెల్లకొండ శ్రీనివాస్ సరసన అనూ ఇమ్మానుయేల్, నభా నటేష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నడు హీరో. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

కాగా సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించిన విలక్షణ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో వలస కార్మికులతోపాటు, వేలాదిమందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. కలియుగ దాన కర్ణుడుగా అడిగినవారికి కాదనకుండా తనవంతుగా సాయం చేయడమే కాదు, నిర్మాణాత్మకంగా, ఒక పథకం ప్రకారం తన కార్యక్రమాలను కొనసాగించడం విశేషంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా