బాలీవుడ్‌ ఎంట్రీ షురూ

20 Sep, 2022 00:48 IST|Sakshi
సందీప్, వరుణ్‌ తేజ్, శక్తి ప్రతాప్‌

వరుణ్‌ తేజ్‌ హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. శక్తి ప్రతాప్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తొలి తెలుగు–హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్‌’తో ఘనవిజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ రెనైసెన్స్‌ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలి సీన్‌కి వరుణ్‌ తేజ్‌ తల్లి పద్మజ కొణిదెల కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత ‘దిల్‌’ రాజు క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఇందులో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా జర్నీలో భాగమైనందుకు హ్యాపీ’’ అన్నారు నిర్మాత సందీప్‌ ముద్దా. ‘‘దేశం గర్వించదగ్గ నిజమైన హీరోల కథలను చెప్పనున్నాం. నవంబర్‌లో షూటింగ్‌ ఆరంభిస్తాం’’ అన్నారు ఇండియా సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ జనరల్‌ మేనేజర్‌ లాడా గురుదేన్‌ సింగ్‌.

మరిన్ని వార్తలు