ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌.. జాతీయ అవార్డు గ్రహీత, ఎవరో గుర్తుపట్టారా?

16 Sep, 2022 21:16 IST|Sakshi

ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలకు సంబంధించిన త్రోబ్యాక్‌ పిక్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు వైరల్‌గా మారాయి. తాజాగా మరో హీరోయిన్‌ చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఆమె నటి మాత్రమే ప్లేబ్యాక్‌ సింగర్‌గా, క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. ఇటీవల ఆమె నటించిన ఓ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది.

అయితే ఆమె నేరుగా ఒక్క తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడి ప్రక్షకులకు కూడా బాగా సుపరిచితురాలే. అచ్చంగా తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ నటి ఎవరో గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదు ఆకాశమే నీహద్దురా చిత్రంలో నటనతో అబ్బురపరిచన అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ బ్యూటీ నటిగా కంటే ముందు సింగర్‌గా, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు పలు షార్ట్‌ ఫిలింస్‌లో కూడా నటించింది.

ఈ క్రమంలో ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. మాలీవుడ్‌, కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ నేపథ్యంలో ఏకంగా తమిళ స్టార్‌ హీరో సూర్య సరసన సూరారై పోట్రు(తెలుగులో ఆకాశమే నీ హద్దురా) మూవీలో చాన్స్‌ కొట్టేసింది. లాక్‌డౌన్‌లో ఓటీటీలో విడుదలైన ఈచిత్రం ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇందులో అపర్ణ.. సుందరిగా సూర్య భార్య పాత్రలో నటించి అద్భుతమైన నటన కనబరిచింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న తన పాత్రకుగానూ అపర్ణ ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకుంది. ఇలా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ ప్రస్తతం బొద్దుగా తయరవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. 

A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali)

A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali)

మరిన్ని వార్తలు