పెళ్లిలో అక్షయ్ కుమార్, మోహన్‌ లాల్ భాంగ్రా స్టెప్పులు.. వీడియో వైరల్

11 Feb, 2023 17:30 IST|Sakshi

బాలీవుడ్ నటులు మరో పెళ్లి ఫంక్షన్‌లో సందడి చేశారు. ఇటీవల కియారా- అద్వానీ పెళ్లిలో బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో జరిగిన మరో వివాహా వేడుకలోనూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులంతా ఓకే వేదికపై మెరిశారు. రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్,అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్‌, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. 

ఈ వివాహ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్టార్ హీరోలు సందడి చేశారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్‌ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోనూ అక్షయ్ తన సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ.. 'మీతో చేసిన ఈ డ్యాన్స్‌ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కె మాధవన్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా మేనేజింగ్ ప్రెసిడెంట్. రాజస్థాన్‌లో పలువురు ప్రముఖులు హాజరైన ఆయన పెద్ద కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.

మరిన్ని వార్తలు