South Korean Actress Suicide: యువ నటి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్‌ నోట్‌

1 Sep, 2022 15:02 IST|Sakshi

‘బతకాలని లేదంటూ నా హృదయం తరచూ ఆవేదన చెందింది..’

ఇటివల కాలంలో బలవ్మరణానికి పాల్పడుతున్న సినీ నటీనటులు సంఖ్య పెరిగిపోతుంది. కొంతమంది ఆఫర్లు రాక, మరికొందరు డిప్రెషన్‌తో ఇలా చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఈ జాబితాలోకి మరో యువ నటి చేరింది. సౌత్‌ కొరియాకు చెందిన నటి యో జూ యూన్‌ ఆగస్ట్‌ 29న డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడింది. మరో దిక్కు లేకే చనిపోతున్నానంటూ ఆమె రాసిన ఈ ఎమోషనల్‌ నోట్‌ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ ఆమె రాసిన ఈ సూసైడ్‌ నోట్‌ అటూ సౌత్‌ కొరియా ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సినీ పరిశ్రమలో సైతం చర్చనీయాంశమైంది.

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

ఇంతకి తన సూసైడ్‌ నోట్‌ యో జూ యూన్‌ ఏం రాసిందంటే.. ‘మీ అందరి కంటే ముందుగా నేను వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమిచండి. ముఖ్యంగా అమ్మా-నాన్న, నానమ్మ, అన్నయ్యకు నా క్షమాపణలు. బతకాలని లేదంటూ నా హృదయం తరచూ ఆవేదన చెందింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పటినుంచో అనుకుంటుంది ఇదే కదా. నేను లేని మీ జీవితాలు వెలితిగా ఉంటాయని తెలుసు. అయినా ధైర్యంగా జీవించడానికి ప్రయత్నించండి. నేను పైనుంచి మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. దయచేసి ఏడవకండి. 

‘ఇప్పటి వరకు అర్హతకు మించి ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడిపాను. అందుకే నాకు ఈ జీవితం ఇక చాలు అనిపించింది. కాబట్టి నా విషయంతో ఎవరిని నిందించకండి. మీరు హ్యాపీగా ఉండండి. నేను చనిపోలేదు. మీతోనే ఉన్న. ప్లీజ్‌ మీరంత సంతోషంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చింది. అలాగే ‘నాకు నటించాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఒకవేళ అది నాలో ఒక భాగమేమో. కానీ ఆ జీవితం అంత సులభం కాదు. నాకు ఇంకేమీ చేయాలని లేదు. అదే నాకు నిరాశ. మనం నచ్చింది చేయాలనుకోవడం వరం. కానీ అది మాత్రమే చేయాలనుకోవడం శాపం. దేవుడికి నేనంటే ప్రేమ. ఆయన నన్ను నరకానికి పంపడు.

చదవండి: యాంకర్‌ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్‌ అట

నా బాధ, నా ఫీలింగ్స్‌ని ఆయన అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తాడు. అందుకే ఎవరూ దిగులు చెందకండి. నన్ను ప్రేమించిన నా కుటుంబానికి, స్నేహితులకు థాంక్యూ. మీ ప్రేమే అదే నా బలం, ఆనందం. నేను చివరివరకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలతో జీవించాను. అదే నా సక్సెస్ అనుకుంటాను. నేను దీనిని మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది కదా. నేను కలుపుకున్న బంధాలకు, ముఖ్యంగా నా గురువులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక సెలవు’ అంటూ యో జూ యూన్ తన సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. 

చదవండి: నటుడు బ్రహ్మాజీ సటైరికల్‌ ట్వీట్‌.. అనసూయను ఉద్ధేశించేనా?

మరిన్ని వార్తలు