వెంటిలేటర్‌పైనే ఎస్పీ బాలు

15 Aug, 2020 16:42 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందం తెలిపింది.  కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో గురువారం రాత్రి ఐసీయూకి తరలించి చికిత్స  అందిస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన డాక్టర్లు ఆయనని పర్యవేక్షిస్తున్నారని, ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లుగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
(చదవండి : ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు)

మరోవైపు బాలు ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ కూడా స్పందించారు. నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వదంతులను నమ్మొద్దు.  ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని వైద్యులు చెప్పారు’అని చరణ్‌ పేర్కొన్నారు. మరోవైపు ఎస్పీ బాలు భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. 

మరిన్ని వార్తలు