పాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ఎస్పీ బాలు

26 Aug, 2020 20:04 IST|Sakshi

చెన్నై: క‌రోనాతో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోలుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న కుమారుడు చ‌ర‌ణ్ బుధ‌వారం వెల్ల‌డించారు. ఆయ‌న‌కు డాక్ట‌ర్లు ఎక్మోతో వైద్యం అందిస్తున్నార‌ని తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని పేర్కొన్నారు. "నాన్నను చూసేందుకు నేను ఆస్ప‌త్రికి వెళ్లాను. నిన్న‌టికంటే నేడు ఎక్కువ సేపు మెళ‌కువ‌గా ఉన్నారు. నాతో ఏదో చెప్ప‌డానికి రాసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ పెన్ను కూడా స‌రిగా ప‌ట్టుకునే శ‌క్తి లేక‌పోవ‌డంతో అది కుద‌ర‌లేదు. అయితే త్వ‌ర‌లోనే రాయ‌గ‌లిగి నాతో మాట్లాతారన్న న‌మ్మ‌కం ఉంది." (చ‌ద‌వండి: ఆదిపురుష్‌.. జక్కన్న రియాక్షన్‌)

"నాన్న‌ పాట‌లు వింటున్నారు. పాడేందుకు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న కోలుకుంటున్నార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఇది నేటి అప్‌డేట్‌. అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు" అని చెప్పుకొచ్చారు. కాగా క‌రోనా సోక‌డంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. తొలుత ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో కాస్త విష‌మించింది. ఈ క్ర‌మంలో ఆయ‌న మ‌ర‌ణించాడంటూ పుకార్లు వ్యాపించ‌గా వాటిని ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ కొట్టిపారేశారు. రెండు మూడు రోజులుగా ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతుండ‌టంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. (చ‌ద‌వండి: ఎస్పీ బాలు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా