ఎస్పీ బాలు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు

15 Sep, 2020 08:02 IST|Sakshi

ఎస్పీ చరణ్‌ వెల్లడి

సాక్షి, చెన్నై: తన తండ్రి మరింత వేగంగా కోలుకుంటున్నారని, ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ‘నేను ఈనెల 10న మీడియాతో మాట్లాడాను. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. వైద్యులు కూర్చోబెట్టగా 15–20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కూడా నయం అవుతోంది. ఆరోగ్యంలో మరింత పురోగతి కనపడుతోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు